ఆసక్తికరంగా 'సలార్‌' పోస్టర్‌.. 'వర్ధరాజ మన్నార్‌'గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌

The makers of 'Saalar' released the first look poster wishing Prithviraj on his birthday. మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా.. అతడు లేటెస్ట్‌గా నటిస్తున్న 'సలార్‌' మూవీ నుంచి నిర్మాతలు

By అంజి  Published on  16 Oct 2022 12:38 PM IST
ఆసక్తికరంగా సలార్‌ పోస్టర్‌.. వర్ధరాజ మన్నార్‌గా పృథ్విరాజ్‌ సుకుమారన్‌

మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా.. అతడు లేటెస్ట్‌గా నటిస్తున్న 'సలార్‌' మూవీ నుంచి నిర్మాతలు బిగ్‌ అప్‌డేట్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో వర్ధరాజ మన్నార్‌గా పరిచయం చేస్తూ పృథ్విరాజ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటుడు-చిత్రనిర్మాత అయిన పృథ్విరాజ్‌ ఆదివారం 40వ ఏట అడుగుపెట్టారు. 'సాలార్' మూవీ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజా పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.

పృథ్వీరాజ్ తన నుదుటిపై నల్లటి తిలకంతో పాటు మెడలో సెప్టమ్ రింగ్‌తో పాటు వెండి చోకర్‌లను ధరించి, సీరియస్‌ లుక్‌లో భయంకరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్‌ను గమనిస్తే పృథ్విరాజ్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తతం పృథ్విరాజ్‌ సుకుమారన్‌ పేరు దక్షిణాదిన మర్మోగిపోతుంది. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'కడువా' తెలుగులో కూడా రిలీజై మంచి విజయం సాధించింది.

కేజీఎఫ్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సాలార్ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ మరియు సినిమా విడుదల తేదీని విడుదల చేశారు. ఇందులో శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "హై-వోల్టేజ్ యాక్షన్"గా బిల్ చేయబడిన 'సలార్‌' మూవీ భారత్‌తో పాటు యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని దేశాలలో చిత్రీకరించబడింది. ఈ పాన్ ఇండియా సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది.


Next Story