అదిరిపోయిన మెగా 154 ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

The glimpse of Mega 154 looks terrific.'గాడ్ ఫాద‌ర్' సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 1:19 PM IST
అదిరిపోయిన మెగా 154 ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

'గాడ్ ఫాద‌ర్' సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పుల్ జోష్‌లో ఉన్నారు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. కేఎస్ ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. మెగా 154 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 24న ఉద‌యం 11.07 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. టీజ‌ర్ కంటే ముందే అభిమానుల్లో జోష్ నింపింది.

తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో పంచెక‌ట్టులో చిరంజీవి స్ట్రైల్‌గా సిగ‌రేట్ తాగుతుండ‌గా.. పొగ అలా వ‌స్తుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రస్తుతం మెగా 154 అప్డేట్‌ నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఫస్ట్ గ్లింప్సే ఇలా ఉంటే.. టీజ‌ర్ అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం అని అంటున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోండ‌గా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యెర్నేనీ రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి 'వాల్తేరు వీర‌య్య' అనే టైటిల్ పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story