ది ఘోస్ట్.. 'త‌మ హ‌గ‌నే ' అర్థం తెలిసింది.. వీడియో

The Ghost Thamahagane Promo released.కింగ్ నాగార్జున న‌టిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2022 11:41 AM IST
ది ఘోస్ట్.. త‌మ హ‌గ‌నే  అర్థం తెలిసింది.. వీడియో

కింగ్ నాగార్జున న‌టిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే చిత్రం అప్పుడే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. ఒక్కొ పోస్ట‌ర్‌, టీజ‌ర్ల‌ల‌ను విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది.

ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల‌ను తెలియ‌జేస్తూ.. 'త‌మ హ‌గ‌నే' అనే ప‌దానికి అర్థం తెలుసుకోమ‌ని చెప్పింది. దీంతో ఈ ప‌దం ఏమై ఉంటుందా..? అని నెటీజ‌న్లంద‌రూ స‌మాధానం క‌నిపెట్టే ప‌నిలో ఉండ‌గా నేటి(గురువారం) ఉద‌యం ఈ ప‌దానికి అర్థం చెబుతూ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాలి. 'త‌మ హ‌గ‌నే అంటే.. విలువైన ఉక్కు' అని అర్థం.

ఈ వీడియోలో అండ‌ర్ వ‌రల్డ్ పంపిన వ్య‌క్తులు త‌న‌పై దాడి చేయ‌నున్నారు అని తెలుసుకున్న నాగార్జున త‌న వ‌ద్ద ఉన్న విలువైన ఉక్కుతో క‌త్తిని సిద్దం చేసుకోవ‌డాన్ని చూయించారు. విజువ‌ల్స్ అన్నీ సాలీడ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ చిత్ర ట్రైగ‌ర్‌ను ఆగ‌స్టు 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Next Story