'ది ఘోస్ట్' మూవీ నుంచి అప్‌డేట్.. కిల్లింగ్ మెషిన్ రాబోతుంది

The first visual of Nagarjuna Ghost movie on July 9th.కింగ్ అక్కినేని నాగార్జున న‌టిస్తున్న‌చిత్రం ది ఘోస్ట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2022 12:56 PM IST
ది ఘోస్ట్ మూవీ నుంచి అప్‌డేట్.. కిల్లింగ్ మెషిన్ రాబోతుంది

కింగ్ అక్కినేని నాగార్జున న‌టిస్తున్న‌చిత్రం 'ది ఘోస్ట్‌'. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా చిత్రీక‌రణ జ‌రుపుకుంటోంది. ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ మిన‌హా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. శ్రీవేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పితో క‌లిసి నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇక చిత్రం బృందం కూడా ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టాల‌ని భావిస్తోంది. అందులో భాగంగానే నేడు ఓఅప్‌డేట్‌తో ముందుకు వ‌చ్చింది. 'ది ఘోస్ట్' ఫస్ట్ విజువల్ ను జూలై 9న విడుదల చేయనున్నట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. చేతిలో ఓ కత్తి పట్టుకుని ఫెరోషియస్ లుక్‌లో నాగ్ కనిపిస్తున్న పోస్టర్‌ను చూస్తుంటే.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతుందని అనిపిస్తోంది. కిల్లింగ్ మెషీన్ ని వదులుతున్నాం అని అన‌డంతో ఫస్ట్ విజువల్ యాక్షన్ ప్యాక్ గా ఉండబోతోందని అర్థం అవుతోంది.

Next Story