ది ఫ్యామిలీ మ్యాన్-3 వచ్చేస్తోంది..ఎప్పటి నుంచి అంటే?

ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు

By -  Knakam Karthik
Published on : 28 Oct 2025 2:42 PM IST

Cinema News, Entertainment, The Family Man, OTT Release, Indian Web Series

ది ఫ్యామిలీ మ్యాన్-3 వచ్చేస్తోంది..ఎప్పటి నుంచి అంటే?

దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వెబ్ సిరీస్‌లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లతో సంచలనం సృష్టించిన ఈ సిరీస్ మూడో సీజన్‌తో మన ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ తొలి రెండు భాగాలు ప్రైమ్ వీడియోలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. సామాన్య కుటుంబ పెద్దగా, అదే సమయంలో దేశాన్ని కాపాడే సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మూడో సీజన్‌లో ఆయన ఎలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నాడనే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొదటి రెండు సీజన్లను అద్భుతంగా తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్ & డీకేనే మూడో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతిపెద్దదిగా భావిస్తున్నారు. శ్రీకాంత్ తివారీ అనే ఉన్నత రహస్య గూఢచారి, తన డిమాండ్ ఉన్న ఉద్యోగాన్ని కుటుంబ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో, శ్రీకాంత్ శక్తివంతమైన కొత్త ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు, అతని మిషన్ గతంలో కంటే ప్రమాదకరంగా మారుతుంది

Next Story