'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైల‌ర్.. ఎప్పుడంటే..?

The Falimy Man 2 web series Trailer will release tomorrow. తాజాగా అక్కినేని సమంతా తొలిసారి నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 1:18 PM IST
The Falimy Man 2 web series

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా థియేట‌ర్లు మూత ప‌డ‌డంతో ఓటీటీల హ‌వా పెరిగిపోయింది. స్టార్ హీరో, హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. తాజాగా అక్కినేని సమంతా తొలిసారి నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయింది. మ‌నోజ్‌బాజ్‌పాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో రెండేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన హిందీ వెబ్‌సిరీస్ చిత్రం ది ఫ్యామిలీ మ్యాన్‌. ఈ చిత్రానికి స్వీకెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెర‌కెక్కింది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ పోషించారు. దీనిని దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెర‌కెక్కించారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. తొలుత దీనిని ఈ ఏడాది ఫిబ్రవ‌రి 12న విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆస‌ల్యమైంది. కాగా.. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను మే 19న విడుద‌ల చేయ‌ను్న‌నారు. ప్రొమోలో స‌మంత‌కు సంబంధించిన పాత్ర ప‌రిచ‌యం కానుంది. ఇక దీనిని జూన్ 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశార‌ని స‌మాచారం. ఇందులో స‌మంత ఉగ్ర‌వాది పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.




Next Story