ఒకే ఫ్రేమ్‌లో కమల్, రజనీ..బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

నాలుగు దశాబ్దాల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు.

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 2:35 PM IST

Cinema News, Entertainment, Kollywood, KamalHaasan, Rajinikanth, Nelson Dilip kumar, Kollywood Reunion, RedGiantMovies

ఒకే ఫ్రేమ్‌లో కమల్, రజనీ..బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

నాలుగు దశాబ్దాల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (KH x RK) అధికారికంగా అనౌన్స్ అయ్యింది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టైలిష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ, కిరణ్ ఆర్ట్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి 12:07 గంటలకు మేకర్స్ ఓ ప్రోమోను విడుదల చేశారు. దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో రజనీ, కమల్ ఇద్దరూ రెట్రో స్టైల్‌లో కనిపించి, తమదైన కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. 'హీరో ఎవరు?' అనే ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ ప్రమో ముగియడం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఇది హాస్యం, నాస్టాల్జియా, విజువల్స్ మేళవింపుతో కూడిన ఒక వినూత్న ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రమో స్పష్టం చేస్తోంది. "నా మిత్రుడు రజనీకాంత్‌తో మళ్ళీ కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.. ప్రతి గొప్ప ప్రయాణానికి మరో అధ్యాయం అవసరం" అంటూ కమల్ హాసన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Next Story