Oscars 2023: బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్
భారత్‌కు చెందిన డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'కు ఆస్కార్ అవార్డు దక్కింది.
By అంజి Published on 13 March 2023 8:12 AM ISTబెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్
అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో ఆస్కార్ అవార్డ్స్ - 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలతో పాటు నామినేషన్ అయిన సినిమాల నటీనటులు, టెక్నికల్ సిబ్బంది హాజరయ్యారు. వేదికపై హాలీవుడ్ తారాలను తమ అందాలను ఆరబోశారు. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని నాటునాటు పాట కూడా ఆస్కార్ వేదికపై ప్రదర్శించబడింది. ఆస్కార్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా భారత్‌కు చెందిన డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'కు ఆస్కార్ అవార్డు దక్కింది.
డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'కు ఆస్కార్ వరించింది. ఈ డాక్యుమెంటరీని కార్తికి గొన్సాల్వేస్ తెరకెక్కించగా, డగ్లస్ బష్, గునీత్ మోంగా, ఆచిన్‌జైన్ నిర్మించారు. బొమ్మన్, బెల్లి అనే జంట.. రఘు అనే అనాథ ఏనుగు పిల్ల కథ. ఈ జంటకు ఏనుగుతో బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని డాక్యుమెంటరీలో చూపించారు. ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటున్న గిరిజనుల జీవితాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎలిఫెంట్ విస్పరర్స్ డిసెంబర్ 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇప్పటికీ 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎస్‌ఎస్ రాజమౌళి బ్లాక్‌బస్టర్ ఆర్‌ఆర్‌ఆర్ నుండి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది.