ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. 'ఆదిపురుష్' టీజర్ వచ్చేస్తోంది..!
The Adipurush teaser will be released on October 3.సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్
By తోట వంశీ కుమార్ Published on 14 Sept 2022 1:11 PM ISTసినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూరైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందింది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
షూటింగ్ పూర్తి అయి నెలలు దాటుతున్నా ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క అప్‌డేట్‌లు రాకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అభిమానుల ఎదురుచూపులను తెరదించుతూ 'ఆదిపురుష్' ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 3న ఏకంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు మొదలెట్టిందట. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. అప్పటి నుంచి సినిమా విడుదల అయ్యేవరకు ఏకధాటిగా అప్‌డేట్‌లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.