నాగచైత‌న్య 'థాంక్యూ' ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

'ThankYou' Movie Pre Release Event on 16th July. తన నటన, అభినయంతో అక్కినేని నాగచైతన్య ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు'

By అంజి  Published on  15 July 2022 5:09 PM IST
నాగచైత‌న్య థాంక్యూ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

తన నటన, అభినయంతో అక్కినేని నాగచైతన్య ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' హిట్‌ సినిమాలతో నాగచైతన్య జోరుమీదున్నాడు. ప్రస్తుతం చైతన్య నటించిన లేటెస్ట్‌ మూవీ 'థాంక్యూ'. ఈ సినిమాతో హ్యట్రిక్‌ హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. జులై 22న రిలీజ్‌ కానున్న 'థాంక్యూ' సినిమాకు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జులై 8న విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల రిలీజ్‌ డేట్‌ రెండు వారాలు వాయిదా పడింది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ వరుస అప్‌డేట్‌లు ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా మూవీ మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ తేదీని వెల్లడించారు.

జులై 16న వైజాగ్‌లోని సర్‌ సీఆర్‌ రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో 'థాంక్యూ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ మేరకు మేకర్స్‌ తాజాగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్‌ గ్రూప్‌ నిర్వహిస్తోంది. నాగచైతన్య మెయిన్‌ రోల్‌లో నటించిన ఈ మూవీపై ప్రేక్ష‌కుల‌లో మొద‌టి నుండి మంచి అంచ‌నాలే ఉన్నాయి. లేటెస్ట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సంగీతం అందించారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ మూవీని నిర్మించారు.


Next Story