లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌

Thank You Brother Official Trailer. అన‌సూయ న‌టిస్తున్న చిత్రం 'థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌'. థిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 11:26 AM GMT
Thank You Brother Official Trailer

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా అల‌రిస్తూనే వెండితెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తున్న న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం 'థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌'. థిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుత‌న్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌, మౌనిక రెడ్డి, ఆద‌ర్శ్‌, వైవా హ‌ర్ష‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమేశ్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ ‌చంద్ర‌రెడ్డి, తార‌క‌నాథ్‌రెడ్డిలు నిర్మాస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ప్ర‌చార చిత్రాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా గురువారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఓ అపార్టుమెంట్‌లో ప్రియ‌(అన‌సూయ‌) నివాసం ఉంటోంది. ఆమె గ‌ర్బిణి. ఒక రోజు కింద‌కు వెళ‌దాం అని లిప్ట్‌లోకి వెళ్ల‌గా.. షార్ట్ స‌ర్య్కూట్ అవుతుంది. అదే లిప్ట్‌లో విరాజ్ కూడా ఉంటాడు. అప్పుడే ప్రియ‌కు నొప్పులు మొద‌ల‌వుతాయి. ప్రియ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ యువ‌కుడు ఏం చేశాడు..? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉత్కంఠ భ‌రితంగా సాగిన ట్రైల‌ర్ సినిమాపై అంచాన‌లు పెంచేసింది.
Next Story