సర్‌ప్రైజ్ ఇచ్చిన థమన్.. 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్
Thaman shares Sarkaru Vaari Paata title song tune.సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.
By తోట వంశీ కుమార్ Published on
23 Jan 2022 6:42 AM GMT

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సమ్మర్‌కు వాయిదా పడింది. దీంతో మహేశ్ అభిమానులు కొంచెం నిరాశకు గురి అయ్యారు. ఇక ఈ చిత్ర ఆలస్యానికి చాలా కారణాలే ఉన్నాయి. మహేశ్ బాబు మెకాలికి సర్జరీ, ఆ తరువాత మహేశ్, కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక వేసవి విడుదల కానున్న ఈ చిత్ర అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం నుంచి కాకపోయినా.. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఓ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ ట్యూన్‌ను కొద్ది సేపు ప్లే చేసి వినిపించాడు థమన్. దీంతో మహేష్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ప్రస్తుతం థమన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story