ఇట్స్ అఫీషియ‌ల్‌.. రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా ఛాన్స్ కొట్టేసిన‌ థ‌మ‌న్‌

Thaman confirmed as a Music director for Ram charan new movie.టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ హ‌వా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2021 8:35 AM GMT
ఇట్స్ అఫీషియ‌ల్‌.. రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమా ఛాన్స్ కొట్టేసిన‌ థ‌మ‌న్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న అందించిన బాణీలు ప‌లు రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ బిగ్గెస్గ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కునుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకొంటున్న ఈ ప్రాజెక్టులోకి త‌మ‌న్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ఆయ‌న సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు.

త‌మ‌న్ స్టూడియోకి వెళ్లిన శంక‌ర్‌, చెర్రీ, నిర్మాత శిరీష్‌లు ఆయ‌న‌తో ఫోటోలు దిగారు. ఫ‌స్ట్ రికార్డింగ్ స్నీక్ పీక్‌లో భాగంగా 135 మంది మ్యూజిషియ‌న్స్‌తో క‌లిసి త‌మ‌న్ చేసిన మ్యూజిక్ కి శంక‌ర్‌, చెర్రీ లు మైమ‌రిచిపోయార‌ని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం 2024లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story