పైరసీ బారిన 'మాస్ట‌ర్‌'.. నెట్టింట ప్రత్యక్షమైన సీన్స్

Thalapathy Vijays Master scenes leaked.కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ఇల‌య‌ద‌ళ‌ప‌తి నటించిన చిత్రం 'మాస్టర్' పైరసీ బారిన.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2021 11:13 AM IST
master movie

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ఇల‌య‌ద‌ళ‌ప‌తి నటించిన చిత్రం 'మాస్టర్. ఈ సినిమా జ‌న‌వ‌రి 13న పెద్ద ఎత్తున విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో విడుదల కాబోతున్న భారీ చిత్రం 'మాస్టర్' కావడంతో.. ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే.. విడుద‌ల‌కు కొద్దిగంట‌ల ముందు పైర‌సీ బారిన ప‌డింది.'మాస్టర్' ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే సినిమా ఇంటర్వెల్ సీన్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా నుంచి చిన్న చిన్న క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


పలువురు తమ వాట్సాప్ లో స్టేట‌స్‌లు పెడుతున్నారు. ఇది చూసిన చిత్ర బృందం వెంట‌నే అప్ర‌మత్తం అయింది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు."దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ ట్వీట్ చేశాడు.


Next Story