దళపతి విజయ్ తన కెరీర్ లో 69వ సినిమా చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు విజయ్ చేయబోయే ఆఖరి సినిమా ఇది. ఈ చిత్రానికి ఇప్పుడు అధికారిక టైటిల్ వచ్చేసింది. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆయన చివరి ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'జన నాయగన్' అని పేరు పెట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఆదివారం సోషల్ మీడియాలో విజయ్ స్వయంగా తన సినిమా గురించి అధికారిక ప్రకటనను పంచుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు చిత్ర అధికారిక నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ అంతకు ముందు సోషల్ మీడియాలో ప్రకటించింది. జన నాయగన్ ఈ సంవత్సరంలో అభిమానులు అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. పోస్టర్‌లో విజయ్ బ్యాక్ గ్రౌండ్ లో తన ఫాలోవర్స్ తో సెల్ఫీ దిగుతూ కనిపించాడు. డెనిమ్ చొక్కా, డెనిమ్ ప్యాంటు, సన్ గ్లాసెస్-సాధారణ వస్త్రధారణలో విజయ్ కనిపించాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.