మ‌హాభార‌తానికి ఇంకో పేరే జ‌య

Thalaivi trailer release.త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌తన‌టి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా వ‌స్తున్న చిత్రం త‌లైవి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2021 12:54 PM IST
Thalaivi trailer release

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌తన‌టి జ‌య‌ల‌లిత పురచ్చితలైవిగా ఖ్యాతిగాంచిన సంగ‌తి తెలిసిందే. సినీ, రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది జ‌య‌ల‌లిత. ఆమె బ‌యోపిక్‌గా వ‌స్తున్న చిత్రం త‌లైవి. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తోంది. కాగా.. ఈ రోజు కంగ‌నా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌నా పూర్తిగా ఒదిగిపోయింది. ద‌ర్శ‌కుడు విజ‌య్ చాలా గ్రాండియ‌ర్‌గా ట్రైల‌ర్‌ను క‌ట్ చేయించారు. ట్రైల‌ర్ చూస్తుంటే జ‌య‌ల‌లిత సినీ, రాజ‌కీయాన్ని చాలా చ‌క్క‌గా వెండితెర‌పై చూపించ‌నున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. ఎం జి ఆర్ రోల్ లో నటించిన అరవింద స్వామి ఆ రోల్ లో కరెక్ట్ గా సెట్టయ్యి మరో బిగ్ ఎసెట్‌ గా కనిపిస్తున్నారు.

'మ‌హాభార‌తంలో కూడా ద్రౌప‌దికి ఇదే జ‌రిగింది. త‌న చీర‌ను లాగి అవ‌మాన‌పరిచిన కౌర‌వుల క‌థ ముగించి, జ‌డ ముడేసుకుని త‌న శ‌ప‌థాన్ని నేర‌వేర్చుకుంది. ఆ మ‌హాభార‌తానికి ఇంకో పేరుంది.. జ‌య' అంటూ కంగ‌నా చెప్పిన డైలాగ్ బాగా ఆక‌ట్టుకుంటోంది. జీవీ ప్ర‌కాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ట్రైల‌ర్ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేసింది. విబి పతాకంపై విష్ణువ‌ర్థ‌న్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




Next Story