'రంజిత‌మే'.. తెలుగులోనూ అదిరిపోయింది

Telugu version of Ranjithame out now.ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చిత్రం 'వారిసు'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 5:37 AM
రంజిత‌మే.. తెలుగులోనూ అదిరిపోయింది

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. తెలుగులో 'వార‌సుడు' పేరుతో రానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి రెండో వారంలో ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.

ఇప్ప‌టికే త‌మిళ వెర్ష‌న్ 'రంజిత‌మే' పాట‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తెలుగులో ఈ పాట ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. కొద్దిసేప‌టి క్రిత‌మే ఈ పాట‌ను విడుద‌ల చేశారు. తెలుగులోనూ 'రంజిత‌మే' అంటూ ఈ పాట సాగుతోంది.

త‌మిళ వెర్ష‌న్ సాంగ్‌ను హీరో విజ‌య్ పాడ‌గా, తెలుగులో అనురాగ్ కుల‌క‌ర్ణి, ఎం.ఎం.మాన‌సి పాడారు. తెలుగు పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన ఈ పాట తెలుగులోనూ అదుర్స్ అనేలా ఉంది.

Next Story