డ్రగ్స్‌ విక్రయం కేసులో 'కబాలి' తెలుగు నిర్మాత అరెస్ట్

డ్రగ్స్‌ విక్రయాల కేసులో కబాలి సినిమా తెలుగు ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Jun 2023 3:13 PM IST
drugs, cocaine, telugu producer, krishna prasad chowdary

డ్రగ్స్‌ విక్రయం కేసులో 'కబాలి' తెలుగు నిర్మాత అరెస్ట్

డ్రగ్స్‌ విక్రయాల కేసులో కబాలి సినిమా తెలుగు ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందుగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

డ్రగ్స్‌ విక్రయాల కేసులో కబాలి చిత్ర తెలుగు నిర్మాత కృష్ణప్రసాద్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారించారు. ఆ తర్వాత తాజాగా అరెస్ట్‌‌ చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. కృష్ణప్రసాద్‌ చౌదరి కొకైన్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడి దగ్గర నుంచి 82.75 గ్రాముల కొకైన్‌తో పాటు కారు, రూ.2.05 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కృష్ణప్రసాద్‌ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్‌. ఆయన బీటెచ్‌ చదివారు. చదువు పూర్తయ్యాక పలు కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశారు. కానీ.. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. 2016 నుంచి సినిమా రంగంలోనే ఉన్నారు. అయితే.. రజనీకాంత్‌ హీరోగా నటించిన 'కబాలి' సినిమా తెలుగు వెర్షన్‌కు కృష్ణప్రసాద్ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు.

కృష్ణప్రసాద్ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశారు. పవన్ కల్యాణ్ సర్దార్‌ గబ్బర్‌సింగ్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్‌ సురవరం సహా మరికొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు కృష్ణప్రసాద్‌ చౌదరి. సినిమాపై ఫ్యాషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అనుకున్నంత లాభాలు రాలేదు. తీవ్రంగా నష్టపోయాడు. దీంతో.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ష్ణప్రసాద్‌ చౌదరి డ్రగ్స్‌ సరఫరాలోకి దిగారు. గోవాలో పబ్‌ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేశారు. ఇందులోనూ నష్టాలు రావడంతో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి హైదరాబాద్‌ వచ్చారు కేపీ చౌదరి. గోవా నుంచి హైదరాబాద్‌కు వచ్చేముందు నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి 100 ప్యాకెట్ల కొకైన్‌ను తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో కొన్నింటిని వినియోగించారని.. మిగిలిన వాటిని కిస్మత్‌పూర్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు.

Next Story