తెలుగు నటుడు అల్లు రమేష్ హఠాన్మరణం

ఇటీవల 'మా విడాకులు' వెబ్ సిరీస్‌లో నటించిన తెలుగు నటుడు, హాస్యనటుడు అల్లు రమేష్ (55) మంగళవారం విశాఖపట్నంలో

By అంజి
Published on : 18 April 2023 12:39 PM IST

Telugu actor , allu ramesh , Tollywood

తెలుగు నటుడు అల్లు రమేష్ హఠాన్మరణం

ఇటీవల 'మా విడాకులు' వెబ్ సిరీస్‌లో నటించిన తెలుగు నటుడు, హాస్యనటుడు అల్లు రమేష్ (55) మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు. నటి రేఖా బోజ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆయన అకాల మరణ వార్తను తెలియజేశారు. రమేష్‌ సినీ పరిశ్రమలోకి రాకముందు రమేష్ పలు నాటకాల్లో నటించారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా తనదైన ప్రత్యేక కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు రమేష్‌.. 'నెపోలియన్', 'తోలుబొమ్మలాట', 'మధుర వైన్స్', 'రావణ దేశం' వంటి సినిమాలలో నటించారు. 'కేరింతలు' సినిమాలో హీరోకి తండ్రిగా రమేష్ నటించారు. దాదాపు 100సినిమాల్లో పలు క్యారెక్టర్లలో అల్లు రమేష్ నటించారు. విశాఖలోని దొండపర్తి ప్రాంతానికి చెందిన ఆయనకు భార్య వరలక్ష్మి (రైల్వే ఉద్యోగిని), పిల్లలు వంశీ, రేవంత్ ఉన్నారు. రమేష్ మృతి తమను ఎంతగానో బాధించిందని రంగసాయి నాటక సంస్థ అధ్యక్షుడు బాదంగీర్ సాయి ఒక ప్రకటనలో తెలిపారు.


Next Story