తేజస్వీ ఆసక్తికర కామెంట్స్.. పానీపూరి బండివాడిని పెళ్లిచేసుకోవాలని కోరిక.. అంతా ఐపోయిందట‌

Tejaswi Madivada interesting comments on marriage.టాలీవుడ్‌లో ఐస్‌క్రీం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తెలుగ‌మ్మాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2021 6:04 AM GMT
తేజస్వీ ఆసక్తికర కామెంట్స్.. పానీపూరి బండివాడిని పెళ్లిచేసుకోవాలని కోరిక.. అంతా ఐపోయిందట‌

టాలీవుడ్‌లో ఐస్‌క్రీం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తెలుగ‌మ్మాయి తేజ‌స్వీ మ‌దివాడ‌. ఆచిత్రంతో కుర్ర‌కారు మదిలో గుబులు పుట్టించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, లవర్స్, అనుక్షణం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శ్రీమంతుడు, పండగ చేస్కో, రాజు గారి గ‌ది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో న‌టించినా అమ్మ‌డికి పెద్ద‌గా పేరు రాలేదు. ఇక తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 2లో పాల్గొని రచ్చ‌ర‌చ్చ చేసింది. బిగ్‌బిస్‌తో త‌న ద‌శ మారిపోతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికి అలా జ‌ర‌గ‌లేదు.

ఓ షోకి హోస్ట్ ఛాన్స్ వ‌చ్చినా.. ఆ షోకి రేటింగ్ లేని కారణంగా పోయింది. దీంతో ఇప్పుడు అమ్మడు మళ్ళీ సినిమాల మీద పడింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో మాత్రం అమ్మ‌డు తెగ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు పుట్టిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఒక పానీ పూరీ బండిని తోస్తున్నట్టు ఫోజులు ఇచ్చింది తేజస్వీ.

నేను చిన్నప్పుడు ఒక పానీ పూరీ బండి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే.. తాను ఇప్పుడు చిన్న‌పిల్ల‌ను కాద‌ని.. అస‌లు పెళ్లే అవ‌స‌రం లేద‌ని తాను ఇప్పుడు తెలుసుకున్నాన‌ని ఆ ఫోటో కింద రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం తేజ‌స్వీని కమిట్మెంట్ చిత్రంలో న‌టిస్తుంది. లక్ష్మీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజస్వితో పాటు అన్వేష్ జైన్, రమ్య పసుపులేటి కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

Next Story