విషాదం.. 'మర్మదేశం' సీరియల్ ఫేమ్ లోకేష్ రాజేంద్రన్ ఆత్మహత్య
Tamil TV actor Lokesh Rajendran dies by suicide.మర్మదేశం సీరియల్ ఫేమ్ లోకేష్ రాజేంద్రన్ బలవన్మరణానికి
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2022 5:32 PM IST
పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, మర్మదేశం సీరియల్ ఫేమ్ లోకేష్ రాజేంద్రన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 1వ తేదీన చెన్నై పట్టణంలోని కోయంబేడు బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో లోకేష్ కనిపించాడు. అతడిని గుర్తించిన స్థానికులు 108లో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్4న మరణించాడు. విషం తాగినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలనటుడిగా లోకేష్ 'మర్మదేశం' సీరియల్‌లో 'రాసు' పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 150పైగా సీరియల్స్‌లో 15 చిత్రాల్లో నటించారు. నిర్మాతగా కూడా ఓ చిత్రాన్ని తీసేందుకు సన్నాహకాలు మొదలుపెట్టారు. ఇంతలోనే ఇలా మరణించారు.
లోకేష్‌కి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు, ఆర్థిక కారణాల వల్లనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని లోకేష్ తండ్రి తెలిపాడు. కాగా.. నాలుగు రోజుల క్రితమే భార్య నుంచి విడాకుల నోటీసు వచ్చాయని దీంతో లోకేష్ తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపాడు. తన కుమారుడిని చివరి సారిగా శుక్రవారం చూసినట్లు, కొంత నగదు కావాలంటే ఇచ్చానని ఇలాంటి ఘోరాన్ని ఊహించలేకపోయానని విలపిస్తూ చెప్పాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా..? ఇంకా ఏదైనా కారణం ఉందా..? అన్నది కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.