తమిళ నటుడు అజిత్ పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అజిత్ మీడియాకు ఇచ్చిన అధికారిక ప్రకటనలో “నా తండ్రి ఈ క్షణం చూసి ఉంటే గర్వించి ఉండేవారు” అని అన్నారు. భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల గ్రహీతలను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు పొందిన వ్యక్తుల జాబితాలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్ ఉన్నారు.
అజిత్ అవార్డు అందుకున్నందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పద్మభూషణ్ అవార్డు రావడంపై అజిత్ స్పందించారు. భారత రాష్ట్రపతి చేత పద్మ అవార్డును అందుకోవడం తనకు చాలా గౌరవంగా ఉందని అజిత్ అన్నారు. భారత రాష్ట్రపతి గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నటుడు తన దివంగత తండ్రిని గుర్తుచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న సమయంలో ఆయన జీవించి ఉంటే తప్పకుండా గర్వపడేవారని అజిత్ భావోద్వేగానికి గురయ్యారు.