ఆ రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధం

సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువ' సినిమా మీద అటు తమిళనాడులోనే కాకూండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 May 2024 5:00 PM IST
tamil, movies, kanguva , bharateeyudu-2,

ఆ రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధం

సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువ' సినిమా మీద అటు తమిళనాడులోనే కాకూండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా చెబుతున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కంగువా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిత్రబృందం ధృవీకరించింది. 3D వర్క్స్, VFX సహా అన్ని ప్రొడక్షన్ పనులు ఆగస్ట్ చివరి నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా భారీ వార్ సీక్వెన్స్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు శివ అండ్ టీమ్. ఈ వార్ ఎపిసోడ్ లో దాదాపు 10,000 మంది పాల్గొననున్నారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ను స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని నటిస్తూ ఉన్నారు.

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 విడుదల కూడా చాలా ఆలస్యమైంది. అయితే ఇండియన్ 2 తర్వాత ఇండియన్ 3 ని కూడా తీసుకుని రానున్నారు. ఇండియన్ 2 ప్రమోషన్లలో భాగంగా RCB- CSK మధ్య జరిగిన IPL మ్యాచ్ కోసం శంకర్, కమల్ హాసన్ స్టార్ స్పోర్ట్స్‌లో కనిపించారు. ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలు 6 నెలల వ్యవధిలో విడుదల కానున్నాయని వారు ధృవీకరించారు. ఇండియన్ 2 జూలై 2024లో, ఇండియన్ 3 జనవరి 2025లో విడుదల అవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ జూన్ 1న జరుగుతుంది. ఇండియన్ 3 కథ చెప్పిన తర్వాతే తాను ఇండియన్ 2 చేయడానికి అంగీకరించానని కమల్ చెప్పుకొచ్చారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ సినిమా పెద్ద కథతో కూడుకున్నదని, మూడు గంటల్లో పూర్తి చేయలేమని చెప్పారు. అందుకే రెండు భాగాలుగా రూపొందిందని తెలిపారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ 2 జులై 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవ్వనుంది.

Next Story