విషాదం.. గుండెపోటుతో ప్రముఖ గాయని రమణి అమ్మాల్ కన్నుమూత
ప్రముఖ తమిళ జానపద గాయని రమణి అమ్మాల్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ జానపద గాయని రమణి అమ్మాల్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 69 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అమ్మాల్ జానపద పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేజ్ షోలలో హై-వోల్టేజ్ ప్రదర్శనల కారణంగా అందరూ ముద్దుగా రాక్‌స్టార్ 'రమణి అమ్మాల్' అని పిలుచుకుంటారు.
'కాదల్' చిత్రంలో 'తండట్టి కుప్పాయి' పాట రమణికి మంచి గుర్తింపు తెచ్చింది. 'కథయవరన్' (2008), 'తేనావట్టు' (2008), 'హరిదాస్' (2013) వంటి చిత్రాల్లో పాటలు పాడింది. ఆమె 2017లో జీ టీవీ యొక్క రియాలిటీ షో ‘సరేగమప ’ ద్వారా తమిళ వినోద పరిశ్రమలో మరింత ఫేమస్ అయ్యింది. ఎంతగా గుర్తింపు వచ్చినప్పటికి ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. చనిపోయే ముందు వరకు ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె US, సింగపూర్, శ్రీలంకలలో స్టేజ్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చి మన్ననలు పొందింది. అంతేకాదు ఆమె పలు సీరియల్స్‌లో కూడా నటించింది.
రమణి అమ్మాళ్ ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.