ముఖం పాడు చేశావ్.. కోటి రూపాయలు కట్టు అంటున్న హీరోయిన్
Tamil actress Raiza Wilson slaps legal notice on dermatologist. నటి రెజా విల్సన్ ముఖాన్ని వికృతంగా మార్చేసిన ఘటన సోషల్ మీడియాలో
By Medi Samrat
నటి రెజా విల్సన్ ముఖాన్ని వికృతంగా మార్చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..! ఓ డెర్మటాలజిస్ట్ ఆమెకు అనవసరమైన ట్రీట్మెంట్ ను ఇచ్చి ఆమె ముఖం ఓ వైపు ఉబ్బేలా చేసింది. దీంతో రైజా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. రైజా విల్సన్ తనకు వద్దు అని చెబుతున్నా కూడా డాక్టర్ భైరవి సెంథిల్ వినకుండా చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి కనిపించింది. "నాకు అవసరం లేకపోయినా డాక్టర్ భైరవి సెంథిల్ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇలా వచ్చింది.. దీని గురించి అడగాలని వెళ్తే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్ చేసింది. ఈ విషయం బాగా హాట్ టాపిక్ అయింది.
తన ముఖానికి అనవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ భైరవిపై చర్యలకు ఉపక్రమించింది రెజా. తన సినిమా షూటింగ్ లు ఆగిపోవడమే కాకుండా.. ఆమె చేసిన పనికి మానసికంగానూ బాధను అనుభవించానని వెల్లడించింది. ముఖం మీద వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడప్పుడే సినిమాల్లోనూ నటించలేనని.. దీనివల్ల ఆదాయం కూడా కోల్పోతున్నానని తెలిపింది. ఆమె నిర్లక్ష్యానికి తాను మూల్యం చెల్లించుకున్నానని.. తనకు జరిగిన నష్టానికి గానూ డాక్టర్ భైరవి నుంచి కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని తమిళనాడు మెడికల్ కౌన్సిల్‌తోపాటు నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది రెజా. మంచిగా ఉన్న ఆమె ముఖాన్ని పాడు చేసినందుకు డాక్టర్ భైరవి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని రెజా అభిమానులు చెబుతూ ఉన్నారు. ఇక ఆ డాక్టర్ చేతిలో గతంలో ఎంతో మంది బలైనట్లు కూడా కథనాలు వచ్చాయి.