విషాదం.. యువ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
Tamil Actress Powlen committed suicide in Chennai.తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 18 Sept 2022 3:39 PM ISTతమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి దీప అలియాస్ పౌలిన్ ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వయస్సు 29 సంవత్సరాలు.
పలు చిత్రాల్లో సహాయ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప. నూతన దర్శకుడు మహివర్మన్ దర్శకత్వంలో ప్రేమ మహేంద్రన్ నటించిన 'వైధ' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నటి దీపా అలియాస్ పౌలిన్ జెస్సికా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి ముందు ఆమె విశాల్ 'తుప్పరివాలన్'లో సహాయక పాత్రలో నటించింది.
గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటోంది దీప. ఆమెతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఎత్తసేపటికి ఎత్తపోవడంతో వారికి అనుమానం వచ్చింది. ఆమె స్నేహితుడు ప్రభాకరన్‌కు విషయం చెప్పగా అతడు దీప ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు.
దీప ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదు అని రాసి ఉంది. జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది. అయితే.. అతడి పేరు మాత్రం రాయలేదు. దీప మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.