తీవ్ర గాయాలపాలైన నటి.. బాయ్‌ఫ్రెండ్‌ దాడి చేయడంతో..

తమిళ నటి అనిఖా విక్రమన్‌.. తనపై జరిగిన దాడిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. అనిఖాపై ఆమె ప్రియుడు దాడి చేశాడు.

By అంజి  Published on  7 March 2023 11:02 AM IST
Tamil actress, Anikha Vikraman

తమిళ నటి అనిఖా విక్రమన్

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళాపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దాడులను ఎదుర్కొంటున్నారు. తాజాగా తమిళ నటి అనిఖా విక్రమన్‌.. తనపై జరిగిన దాడిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. అనిఖాపై ఆమె ప్రియుడు దాడి చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను అనిఖా నెట్టింట షేర్‌ చేస్తూ.. తన ప్రియుడు చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఫోటోల్లో అనిఖా శరీరం నిండా గాయాలతో, ముఖం, కళ్లు కాలిపోయి కనిపించింది. తన బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రాణహాని ఉందని, తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో అభిమానులు ఆమెకు సానుభూతి తెలుపుతున్నారు. అనూప్‌ పిల్లై అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతడు తనను శారీరకంగా వాడుకొని మానసికంగా తీవ్ర మనోవేదనకు గురి చేశాడని అనిఖా తెలిపింది.

తన మాజీ ప్రియుడు తనపై దాడి చేశాడని ఆరోపించిన అనికా విక్రమన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మాజీ ప్రియుడు ఎన్నో ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని నటి అనికా విక్రమన్ ఫిర్యాదులో పేర్కొంది. బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చెన్నైలో ఉంటున్న సమయంలో తన మాజీ ప్రియుడు తనను కొట్టాడని పేర్కొన్న అనికా విక్రమన్.. ఆ సమయంలో తన ప్రియుడు తనకు క్షమాపణ చెప్పినందుకే ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు అతడిపై ఫిర్యాదు చేశానని తెలిపింది. పదే పదే వేధిస్తున్నాడని అనిఖా ఆరోపించింది. ఇక అనిఖా గాయాలతో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ అంశం చాలా పెద్ద వివాదానికి దారితీసింది. అనిఖా విక్రమన్​ 'ఎంగ పాటన్ సొత్తు' అనే తమిళ్​ సినిమాతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'విషమకరణ్', 'ఐకేకే' అనే సినిమాలు చేసింది. ఈ సినిమాలే కాకుండా మలయాళ తెరలో పలు చిత్రాల్లో నటించిన అనికా విక్రమన్ స్వస్థలం కేరళ.


Next Story