యూఎస్‌ ఆర్మీలో న్యాయవాదిగా చేరిన.. తమిళ నటి అఖిల నారాయణన్

Tamil actress Akila Narayanan joins US Army as lawyer

By అంజి  Published on  2 March 2022 7:48 AM IST
యూఎస్‌ ఆర్మీలో న్యాయవాదిగా చేరిన.. తమిళ నటి అఖిల నారాయణన్

భారతీయ సంతతికి చెందిన తమిళ సినీ నటి అఖిల నారాయణన్ అమెరికా సాయుధ దళాలలో న్యాయవాదిగా చేరడం ద్వారా చరిత్ర సృష్టించారు. గతేడాది దర్శకుడు అరుల్‌ హారర్‌ థ్రిల్లర్‌ 'కాదంపరి' సినిమాతో తెరంగేట్రం చేసిన అఖిల నారాయణన్‌ ఇప్పుడు యూఎస్‌ ఆర్మీలో చేరారు. సాయుధ దళాలలోకి ప్రవేశించడానికి అఖిల యూఎస్‌ ఆర్మీ పోరాట శిక్షణ పొందవలసి వచ్చిందని, అది చాలా నెలల పాటు నడిచిందని వర్గాలు చెబుతున్నాయి.

శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, నటి అఖిల ఇప్పుడు యూఎస్‌ ఆర్మీలో న్యాయవాదిగా చేరింది. యుఎస్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన నటి అఖిల గత సంవత్సరం 'కాదంపరి'తో నటనలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు పృథివీ సంగీతం, వీటీకే సినిమాటోగ్రఫీ అందించారు. ఆసక్తికరంగా.. అఖిల నైటింగేల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అనే ఆన్‌లైన్ సంగీత పాఠశాలను కూడా నడుపుతోంది.


Next Story