విషాదం.. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

Tamil actor Siva Narayan Murthy dies at 68.సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 1:38 PM IST
విషాదం.. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ క‌న్నుమూత‌

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ త‌మిళ క‌మెడియ‌న్ శివ నారాయ‌ణ మూర్తి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం రాత్రి ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 67 సంవ‌త్స‌రాలు. అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఆయ‌న భౌతిక కాయాన్ని పట్టుకోట్టై జిల్లాలోని పొన్నవరాయన్‌కోట్టైలోని ఆయ‌న నివాసానికి త‌రలించారు. గురువారం సాయంత్రం ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

శివ నారాయణమూర్తికి భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు లోకేష్, రామ్‌కుమార్, కుమార్తె శ్రీదేవి ఉన్నారు. ఆయ‌న మృతికి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు న‌టీన‌టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

'పూంతోట్టం' చిత్రంతో ఆయ‌న పరిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200 పైగా చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.

Next Story