భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. చూస్తే షాకే

Tamannaah Bhatia introduces her ‘businessman husband’ amid marriage rumours. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భ‌ర్త‌ను ప‌రిచ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2022 10:16 AM IST
భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. చూస్తే షాకే

గ‌త కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోబోయేది ముంబైకి చెందిన ఓ వ్యాపార వేత్త‌ను అని, అత‌డితో ఏడు అడుగులు వేసేందుకే ఇటీవ‌ల ఎక్కువ‌గా సినిమాలు చేయ‌డం లేద‌ని, పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయింద‌ని ఆ వార్త‌ల సారాంశం. ఈ వార్త‌ల‌కు స‌మాధానం చెబుతూ త‌మ‌న్నా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓస్టోరీ పెట్టింది. త‌న భ‌ర్త ఇత‌డేనంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.


త‌న పెళ్లి గురించి జోస్యం చెప్పిన వారంద‌రికీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. "ఇతనే నా భర్త, బిజినెస్ మెన్ "అంటూ తాను నటించిన F-3 సినిమాలోని తన పాత్రకు సంబంధించిన ఒక క్లిప్పింగును ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది." మార్యేజ్ రూమ‌ర్స్ "అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేసింది.

ఎఫ్ త్రీ చిత్రంలో క‌థానుసారంగా కొన్ని స‌న్నివేశాల్లో మ‌గాడి వేషంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. వాటినే త‌మ‌న్నా పంచుకుంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. హిందీ, మలయాళంలో ఒక్కొ సినిమా చేస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'భోళా శంక‌ర్‌'లో, స‌త్య‌దేశ్ స‌ర‌స‌న 'గుర్తుందా శీతాకాలం' లో న‌టిస్తోంది.

Next Story