తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ఆ సినిమాను నిలబెట్టగలవా?
తమన్నా, రాశీఖన్నా జంటగా నటించిన 'అరణ్మనై 4' చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 8:15 PM ISTతమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ఆ సినిమాను నిలబెట్టగలవా?
సుందర్ సి దర్శకత్వంలో తమన్నా, రాశీఖన్నా జంటగా నటించిన 'అరణ్మనై 4' చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో 'బాక్' టైటిల్‌తో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్స్, ట్రైలర్ లలో తమన్నా, రాశి ఖన్నాలను చాలా గ్లామరస్‌గా చూపించారు. అంతే తప్ప రొటీన్ హారర్ కామెడీగా సినిమా అనిపిస్తూ ఉంది.. తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదా అనేది ప్రశ్న.
అరణ్మనై ఫిల్మ్ ఫ్రాంచైజీలో ఇది 4వ చిత్రం. ఈ సినిమాలు హారర్ కామెడీ కథాంశంతో ఉంటాయి. అరణ్మనై పెద్ద హిట్ అయ్యింది.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్ అంత విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు అరణ్మనై 4తో టీమ్ పూర్తిగా తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్‌పై నమ్మకాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుండి అచాచో/పంచుకో అనే పాట విడుదల చేశారు. తమన్నా, రాశీఖన్నాల గ్లామర్ ఈ పాటలో కనిపిస్తూ ఉంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలోని కొన్ని భాగాలను తెలుగులో చిత్రీకరించారు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ తెలుగు కోసం కీలక పాత్రలు పోషించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమా మార్కెట్ దారుణంగా ఉంది. ఈ సమయంలో అరణ్మనై 4కు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.