అన‌సూయ ఎంట్రీ.. వారికి త‌మ‌న్నా లీగ‌ల్ నోటిసులు..!

Tamanna gives legal notices to Masterchef makers.అందం, న‌ట‌న‌తో హీరోయిన్‌గా త‌న‌దైన ముద్ర‌వేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 3:43 PM IST
అన‌సూయ ఎంట్రీ.. వారికి త‌మ‌న్నా లీగ‌ల్ నోటిసులు..!

అందం, న‌ట‌న‌తో హీరోయిన్‌గా త‌న‌దైన ముద్ర‌వేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా.. ఇటీవ‌ల టెలివిజ‌న్‌లోని ఓ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఓ ఛానల్‌లో ప్రసారం అవుతున్న 'మాస్టర్‌ చెఫ్‌ తెలుగు' షోకు త‌మ‌న్నా యాంక‌ర్‌గా చేసింది. ఆగ‌స్టు 21న ఈ షో ప్రారంభం అయ్యింది. ఈ షోకి జ‌డ్జీలుగా మ‌హేష్ ప‌డాల‌, సంజ‌య్ తుమ్మ‌, చ‌ల‌ప‌తి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా.. ఈ షో ఆరంభంలో మంచి రేటింగ్‌ను సొంతం చేసుకుంది.అయితే.. ఇటీవ‌ల ఆశించినంత రేటింగ్ రాక‌పోవ‌డంతో త‌మ‌న్నా స్థానంలో యాంక‌ర్ అన‌సూయ‌ను తీసుకున్నారు.

అన‌సూయ ఎంట్రీతో ఈ షోకి మంచి రేటింగ్ వ‌స్తుంద‌ని స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ హౌస్ బావించ‌డ‌మే అందుకు కార‌ణంగా తెలుస్తోంది. కాగా.. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కు త‌మ‌న్నా షాక్ ఇచ్చింది. త‌న‌ను తొల‌గించ‌డంపై అసంతృప్తితో ఉన్న మిల్కీ బ్యూటీ.. త‌న‌కు రావాల్సిన బ‌కాయి మొత్తాన్ని వెంట‌నే చెల్లించాల‌ని త‌న లాయ‌ర్ చేత నోటీసులు పంపించింది. దీనిపై ఆమె లాయ‌ర్ మాట్లాడుతూ.. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టుల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. త‌న క్ల‌యింట్‌తో షో నిర్వాహ‌కులు అన్ ఫ్రొఫెన‌ల్‌గా వ్యవ‌హ‌రించార‌ని.. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా క‌మ్యునికేష‌న్ ఆపివేశార‌ని వెల్ల‌డించారు. కాగా.. ఈ నోటీసులపై ప్రొడక్షన్ హౌస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story