'భోళాశంకర్'.. చిరుతో రొమాన్స్ చేయ‌నున్న త‌మ‌న్నా

Tamanna as heroine in Bhola Shankar movie.మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా చిత్రాల‌ను లైన్‌లో పెడుతూ క్ష‌ణం తీరిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2021 1:19 PM IST
భోళాశంకర్.. చిరుతో రొమాన్స్ చేయ‌నున్న త‌మ‌న్నా

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌గా చిత్రాల‌ను లైన్‌లో పెడుతూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చిరు న‌టించిన 'ఆచార్య' చిత్రం విడుద‌ల సిద్దంగా ఉండ‌గా.. 'లూసిఫ‌ర్' చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండ‌గానే బాజీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్టిన సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా చిరంజీవి న‌టిస్తున్నారు. త‌మిళంలో ఘ‌న విజ‌యం విజయం సాధించిన 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి 'భోళా శంక‌ర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో కల‌క‌త్తా బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

కాగా.. ఈనెల‌ 11న సినిమా ప్రారంభోత్సవ పూజ జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ 15 నుంచి ప్రారంభమవుతుందని చిత్ర‌బృందం తెలిపింది. ఈ చిత్రంలో చిరంజీవి రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర-అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తున్నట్లు చిత్ర బృందం నేడు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

Next Story