నా శృంగార జీవితం ఆసక్తికరంగా లేదు.. అందుకే అనుకుంటా: తాప్సీ

Taapsee Pannu on not being invited to Karan Johar’s Koffee With Karan. హీరోయిన్‌ తాప్సీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. 'దోబారా' ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ మీడియాతో

By అంజి  Published on  8 Aug 2022 2:49 PM IST
నా శృంగార జీవితం ఆసక్తికరంగా లేదు.. అందుకే అనుకుంటా: తాప్సీ

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో 'కాఫీ విత్‌ కరణ్'. తాజాగా ఈ షోపై హీరోయిన్‌ తాప్సీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. 'దోబారా' ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ మీడియాతో ముచ్చటించారు. ''చాలా మంది యాక్టర్స్‌ తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకోవడానికి కరణ్‌ షోలో పాల్గొంటున్నారు. మరి మీకు ఆ షోల్ పాల్గొనడానికి ఇన్విటేషన్‌ అందలేదా?'' అని ఓ జర్నలిస్ట్‌ తాప్సీని ప్రశ్నించాడు. దీనికి తాప్సీ స్పందిస్తూ.. నటీనటుల శృంగార జీవితాలపైనే ఆ షోలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారని, కాఫీ విత్‌ కరణ్‌ షోకి ఆహ్వానించేలా తన శృంగార జీవితం అంత ఆసక్తికరంగా ఏమీ ఉండదని సెటైరికల్‌ కామెంట్స్‌ చేసింది.

ఈ సమాధానంతో అక్కడున్న వారూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కరణ్‌ షోపై ఆమె పరోక్షంగా కామెంట్స్‌ చేసిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. 2004లో ప్రారంభమైన కాఫీ విత్ కరణ్‌కు హోస్ట్‌గా కరణ్‌ జోహార్‌ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో ఏడవ సీజన్ అన్ని ఎపిసోడ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ షోకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, కరీనా కపూర్‌, అమీర్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఇప్పటి వరకూ ప్రసారమైన అన్ని ఎపిసోడ్‌లలోనూ కరణ్‌.. నటీనటుల ప్రైవేట్‌ లైఫ్‌ పైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు.

కాఫీ విత్ కరణ్ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో కరీనా కపూర్ ఖాన్, అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కరణ్.. కరీనాను పిల్లలు పుట్టిన తర్వాత పొందే శృంగార నాణ్యత గురించి అడిగారు. దీనికి కరీనా కరణ్‌కి కూడా యష్, రూహి అనే కవలలు ఉన్నారని కరణ్‌తో చెప్పారు. షో చూస్తున్న తన తల్లితో తాను అలాంటి విషయాల గురించి మాట్లాడలేనని కరణ్ బదులివ్వగా.. అమీర్ ఖాన్‌ వెంటనే స్పందిస్తూ.. ''మీరు ఇతరుల లైంగిక జీవితాల గురించి మాట్లాడటం మీ తల్లికి ఇష్టం లేదు? మరీ ఈ ప్రశ్నలు ఏమిటి?" అని అడిగాడు. 2007లో ఉత్తమ టాక్ షో కాఫీ విత్‌ కరణ్‌ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. కరణ్ కూడా బెస్ట్ టాక్ షో యాంకర్‌గా నిలిచాడు.

Next Story