అఫీషియ‌ల్‌: మిష‌న్ ఇంపాజిబుల్ చిత్రంలో తాప్సీ

Taapsee Pannu joins Mishan Impossible.ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. చాలా చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 6:13 AM GMT
అఫీషియ‌ల్‌: మిష‌న్ ఇంపాజిబుల్ చిత్రంలో తాప్సీ

'ఝుమ్మంది నాదం' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. చాలా చిత్రాల్లో నటించినా.. అమ్మ‌డికి రావాల్సినంత పేరు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది ఈ సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది. అక్క‌డ వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తూ మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ప్ర‌స్తుతం ఏడాదికి ఆరేడు చిత్రాల‌తో తాప్సీ ఎన్న‌డూ లేనంత బిజీగా ఉంది. ఎక్కువ‌గా బాలీవుడ్ చిత్రాల‌పైనే ఫోక‌స్ పెట్టింది. అయితే 'గేమ్‌ ఓవర్‌' తర్వాత ఆమె నుంచి మరో తెలుగు చిత్రమేదీ రాలేదు. తాజాగా 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాలో లీడ్‌రోల్‌లో ఆమె న‌టిస్తోంది.

మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్వరూప్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మంగళవారం నుండి ఈ సినిమా షూటింగ్ లో తాప్సీ పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమెకు యూనిట్ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో తాప్సీ పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్‌ స్వరాలందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడు.. నన్ను తెరపై ఎలా చూడాలని అనుకుంటాడో అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. 'మిషన్ ఇంపాజిబుల్' అలాంటి చిత్రాల్లో ఒక‌టి. ఆకట్టుకునే కథాంశంతో పాటు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ లభించడం ఆనందంగా ఉంది. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని, ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌నని న‌మ్ముతున్నాను అని తాప్సీ తెలిపింది.

Next Story
Share it