బాలీవుడ్ నటికి క్లాస్ పీకిన నెటిజన్లు

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఛావా సినిమాపై స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  20 Feb 2025 8:15 PM IST
బాలీవుడ్ నటికి క్లాస్ పీకిన నెటిజన్లు

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఛావా సినిమాపై స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కుంభమేళాలో తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోయిన తర్వాత జేసీబీ బుల్డోజర్‌తో శవాలను తొలగించారనే భయంకరమైన మరణం కంటే, సినిమాల్లో కల్పితమైన చిత్ర హింసల సీన్స్ కి జనాలు రియాక్ట్ అవుతున్నారని స్వరా భాస్కర్ ఆరోపించారు. అంతేకాకుండా బ్రెయిన్ డెడ్ సమాజం అంటూ ట్వీట్ చేశారు స్వరా భాస్కర్. ఈ ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి.

హిందువులపై ఔరంగజేబ్‌ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్‌ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఛత్రపతి శివాజీ జయంతి రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం.. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఛావా సినిమా హిట్ టాక్ తో దూసుకుపుతోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రలో నటించగా ఆయన భార్య యేసుభాయిబాబు పాత్రలో రశ్మిక మందాన నటించింది.

Next Story