రాజ‌కీయ నాయ‌కుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ న‌టి

Swara Bhasker Got Married To Samajwadi Party Leader.స్వ‌ర భాస్క‌ర్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2023 7:54 PM IST
రాజ‌కీయ నాయ‌కుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ న‌టి

స్వ‌ర భాస్క‌ర్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. 2009లో "మ‌ధోలాల్ కీప్ వాకింగ్" చిత్రం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టింది. న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆమె న‌టిగా కంటే వివాదాల‌తోనే చాలా ఫేమ‌స్ అయ్యింది. స‌మాజంలో జ‌రిగే వాటిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా గ‌ట్టిగానే స్పందిస్తుంటుంది. తాజాగా తాను పెళ్లి చేసుకున్న‌ట్లు చెప్పి అభిమానుల‌కు షాకిచ్చింది. ఓ రాజ‌కీయ నాయ‌కుడిని రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకున్న‌ట్లు నేడు(గురువారం) సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. దండలు మార్చుకున్న ఫొటోలను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

స్వ‌ర భాస్క‌ర్ పెళ్లి చేసుకుంది ఎవ‌రినో కాదు సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగం నాయకుడు ఫహాద్‌ అహ్మద్‌. స్వర తన సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో రెండు నిమిషాల నాలుగు సెకన్ల నిడివి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఫహద్ అహ్మద్‌తో తన బంధం ఎలా మొదలైంది, ఎలా పెళ్లి వరకు వచ్చింది అనే వివరాలు షేర్ చేసింది.

"కొన్నిసార్లు మన పక్కనే ఉన్న దాని కోసం మనం చాలా దూరం వెతుకుతాం. మేం ప్రేమ కోసం వెతికాం. కానీ మొదట స్నేహాన్ని కనుగొన్నాం. తరువాత ఒకరినొకరు కనుగొన్నాము. ఫహద్ జిరార్ అహ్మద్‌కు నా హృదయంలోకి స్వాగతం. నా హృదయం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ అది నీదే" అంటూ ఫహాద్ అహ్మద్ కోసం ఒక అందమైన నోట్‌ను రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Next Story