'భోళా శంకర్' నుంచి అదిరిపోయే ట్రీట్.. ఖుషీలో మెగాఫాన్స్
Swag of Bholaa From Chiranjeevi's Bhola shankar movie.మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలకు సిద్దంగా
By తోట వంశీ కుమార్ Published on
1 Jan 2022 5:17 AM GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా.. పలు ప్రాజెక్టులతో పుల్ బిజీగా ఉన్నారు చిరు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం ఒకటి. తమిళ మూవీ 'వేదాళం' కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. ఆయన చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. కీర్తి సురేష్ భర్త పాత్రలో నాగ శౌర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
ఇక కొత్త సంవత్సరం సందర్భంగా 'స్వాగ్ ఆఫ్ బోలా' అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిన్న ప్రోమో మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. మహతి స్వర సాగర్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో చిరంజీవికి మెగా ఎలివేషన్ ఇచ్చాడు.
Next Story