చిరంజీవి మాటకు నో చెప్పిన పెద్ద కూతురు

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆయనతో గత కొంతకాలంగా సినిమా చేయాలని అనుకుంటుంది. అన్నీ కుదిరా అనుకున్న సమయాన వచ్చిన ఒక ఆఫర్

By Bhavana Sharma  Published on  22 Jun 2023 11:55 AM IST
Chiranjeevi, elder daughter Sushmita, New Movie, Tollywood

చిరంజీవి మాటకు నో చెప్పిన పెద్ద కూతురు

చిరంజీవి కున్న ఇద్దరు కూతుళ్లలో ఒకరైన సుష్మిత కొణిదల కథ కొంతకాలంగా సినిమా ప్రొడక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన సుష్మిత తన తండ్రితో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ముచ్చట పడుతున్న విషయం మెగా ఫాన్స్ అందరికీ తెలిసిందే.

ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి మరియు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల కలిసి తీయాలనుకుంటున్న సినిమాను సుష్మిత నిర్మించడానికి ముందుకు వచ్చిందట. అన్ని సరిగ్గా జరుగుతున్న సమయంలో టాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన ఒక నిర్మాణ సంస్థ చిరంజీవిని అప్రోచ్ అయ్యి ఆ సినిమాను తీయడానికి వారు కూడా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయాన్ని తెలియజేశారు. ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామని చెబుతూ సుస్మితతో కలిసి పనిచేయడానికి ప్రపోజల్ పెట్టారు.

కానీ సుష్మిత మాత్రం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి క్రెడిట్ తనకు మాత్రమే దక్కాలి అన్న ఆలోచనతో, పైగా తండ్రితో సోలో ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలన్న కోరికతో ఈ ప్రపోజల్ కు నో చెప్పిందట. కానీ వచ్చిన ఆఫర్ ను వదులుకోవడం కరెక్ట్ కాదు అనిపించి చిరంజీవి మగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలుస్తోంది. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా కూడా కూతురు సేఫ్ గా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది చిరంజీవికి.

కానీ సుష్మిత మాత్రం ప్రాఫిట్ మరియు లాస్ ను పక్కన పెట్టి, డబ్బుల గురించి అస్సలు ఆలోచించకుండా కేవలం తన తండ్రితో సినిమా తీయాలన్న విషయంపై మాత్రమే ఫోకస్ చేయాలని అనుకుంటా ఉందట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ను మాత్రం పక్కన పెట్టినట్టు వినిపిస్తోంది.

Next Story