నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ప్రమోషన్ దగ్గరి నుంచి విడుదల వరకు ప్రతిదీ ఆకట్టుకునే విధంగా చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌తో దూసుకెలుతోంది. పలువురు ప్రముఖులు సైతం ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ నుండి కూడా జాతి రత్నాలకు సపోర్ట్ లభించింది.
జాతి రత్నాల్లో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఒక చిల్లర గ్యాంగ్ గా వచ్చిన వారి పోస్టర్ లు చాలా వరకు ట్రెండ్ అయ్యాయి. అందులో ఒక పోస్టర్ ను ఇలా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో మార్ఫ్ చేసి జాతి రత్నాలు టీమ్ కు చిన్న సర్ ప్రైజ్ అంటూ 'ఆర్ఆర్ఆర్' టీం సోషల్ మీడియా అధికారిక పేజీలో షేర్ చేసి బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. "నేను గతరాత్రి జాతిరత్నాలు మూవీ చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసి నేనింతగా నవ్వలేదు" అంటూ ట్వీట్ చేశాడు.
Advertisement
Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven't laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless.