సుకుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉప్పెన డైరెక్టర్...

Surprise director who made shocking comments on Sukumar. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అందరి దృష్టి ఎక్కువగా ఉప్పెన సినిమాపైనే ఉంది.

By Medi Samrat  Published on  8 Feb 2021 5:56 PM IST
Surprise director who made shocking comments on Sukumar.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అందరి దృష్టి ఎక్కువగా ఉప్పెన సినిమాపైనే ఉంది. ప్రీ రీలిజ్ ఈవెంట్ తోనే సినిమాకు భారీ హైప్ తీసుకోచ్చి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక దాదాపు బాక్సాఫీస్ హిట్ అనేలా సినిమాను ఒక లెవెల్లో నిలబెట్టారు. రిలీజ్ కోసమే జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని క్లిష్టమైన సన్నివేశాలను చివరి క్షణంలో సుకుమార్ రీ షూట్ చేశారని సమాచారం అందింది.అయితే దర్శకుడు బుచ్చిబాబు ఆ రూమర్స్ పై కామెంట్స్ చేశాడు.

నిజానికి ఉప్పెన సినిమాలో ఎడిటింగ్ లో తీసేయ్యడానికి కూడా ఛాన్స్ దొరకాలేదని సుకుమార్ గారి జడ్జిమెంట్ తప్పితే ఆయన స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదని అన్నాడు.'ఒకవేళ ఆయన మార్పులు చేయమని చెప్పినా కూడా నేను ఏ మాత్రం మార్చను. అది ఆయనకు కూడా తెలుసు. నేను మార్చమని చెప్పినా కూడా నువ్ బయటకు వెళితే మళ్ళీ నీకు నచ్చిందే తీస్తావ్..దొంగా నా కొడకా అంటూ..సరదాగా నాతో అంటూ ఉంటారు' అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. కథ మొదట ఎలా రాసుకున్నానో స్క్రీన్ మీద అదే చూపించడం జరిగిందని, అనుకున్న దానికంటే సినిమా ఇంకా బాగా వచ్చిందని బుచ్చిబాబు తెలిపాడు. ఇక సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Next Story