ఆస్కార్ రేసులో సూర్య మూవీ

Suriya's Soorarai Pottru joins Oscar race.తమిళ స్టార్ హీరో సూర్య‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 10:52 AM GMT
ఆస్కార్ రేసులో సూర్య మూవీ

తమిళ స్టార్ హీరో సూర్య‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం 'సూరరై పోట్రు'(ఆకాశం నీ హద్దురా). ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌.గోపినాథ్ అధినేత ఆటోబ‌యోగ్ర‌ఫీ 'సింప్లి ఫ్లై' ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా థియేట‌ర్లు విడుద‌ల‌కు వీలుకాక‌పోవ‌డంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేశారు. అక్క‌డ ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విడుద‌లైన‌ ప్రతి భాషలోనూ అందరినీ కట్టిపడేసింది. 670 పేజీలుండే 'సింప్లీ ఫ్లై' బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి మంచి విజ‌యం సాధించింది.


సూర్య, అపర్ణల నటన, దర్శకురాలు సుధ కొంగర టేకింగ్‌కి సినీ ప్రముఖుల నుండి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్‌ రేసులో నిలిచిన‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు మేక‌ర్స్. అయితే.. తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్ర‌క‌టించ‌గా.. ఇందులో మ‌న దేశం నుండి సూర‌రై పోట్రు నిలిచింది. మార్చి 5 నుంచి 10 మ‌ధ్య అకాడ‌మీ వారు ఓటింగ్ నిర్వ‌హించి.. మార్చి 15న విజేత‌ల‌ను తెలియ‌జేయ‌నున్నారు.
Next Story
Share it