ఓటీటీలోకి 'రెట్రో'.. ఎప్పటినుంచి అంటే?
రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
By Knakam Karthik
ఓటీటీలోకి 'రెట్రో'.. ఎప్పటినుంచి అంటే?
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో. సూర్య కెరీర్‌లో 44వ చిత్రంగా తెరకెక్కింది. కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. మే 31 నుంచి నెటిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. గత కొన్నిరోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు వచ్చినప్పటికీ తాజాగా నెటిక్స్ అధికారికంగా తేదీని ప్రకటించింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో జోజు జార్జ్, విధు, జయరామ్, నాసర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దీనిని సూర్య, జ్యోతిక, కార్తేకేయన్, రాజశేఖర్ పాండియన్ లతో కలిసి నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు పొందలేదని ప్రచారం ఉంది. OTT విడుదల రెట్రోకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెండవ అవకాశం ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.