ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న'రెట్రో'..ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో.ఈ నేపథ్యంలో రెట్రో ఓటీటీ గురించి డిస్కషన్ జరుగుతోంది

By Knakam Karthik
Published on : 18 May 2025 4:31 PM IST

Cinema News, Entertainment, Retro, Suriya, OTT Release,  Netflix

ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న'రెట్రో'..ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం రెట్రో. సూర్య కెరీర్‌లో 44వ చిత్రంగా తెరకెక్కింది. కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రెట్రో ఓటీటీ గురించి డిస్కషన్ జరుగుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో జోజు జార్జ్, విధు, జయరామ్, నాసర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దీనిని సూర్య, జ్యోతిక, కార్తేకేయన్, రాజశేఖర్ పాండియన్ లతో కలిసి నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు పొందలేదని ప్రచారం ఉంది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. నివేదికల ప్రకారం, 'రెట్రో' మూవీ జూన్ 5, 2025 నుండి హిందీతో సహా పలు భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తేదీని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. OTT విడుదల రెట్రోకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెండవ అవకాశం ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story