సూర్య 42 మోష‌న్ పోస్ట‌ర్‌.. నెక్ట్స్ లెవ‌ల్ అంతే

Suriya42 Motion poster released.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌కు త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2022 12:05 PM IST
సూర్య 42 మోష‌న్ పోస్ట‌ర్‌.. నెక్ట్స్ లెవ‌ల్ అంతే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌కు త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుద‌ల అవుతున్నాయి. ప్ర‌స్తుతం సూర్య వ‌రుస చిత్రాలతో పుల్ బిజీగా ఉన్నాడు. అందులో శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌ను ఇటీవల పూర్తి చేసుకుని షూటింగ్ ప్రారంభించారు.

యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ మరియు కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నేడు ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మోషన్ పోస్టర్ టీజర్ మాత్రం ఎవ్వ‌రు ఊహించ‌ని విధంగా నెక్ట్స్ లెవ‌ల్ లో ఉంద‌నే చెప్పాలి. యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తూ సూర్య భుజం మీద వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ ని రివీల్ చేశారు. చేతిలో ఆయుధాలతో సూర్య ని ఒక వారియర్ గా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ అయితే ఈ టోటల్ టీజర్ కె భారీ హైప్ ని తెచ్చి పెట్టింది. ఈ చిత్రాన్ని 10 బాష‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది.

Next Story