విషాదం.. 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ క‌న్నుమూత‌

Surekha Sikri dies of cardiac arrest at 75.ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 6:08 AM GMT
విషాదం.. చిన్నారి పెళ్లికూతురు బామ్మ క‌న్నుమూత‌

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 75సంవ‌త్స‌రాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సురేఖా సిక్రీ మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. పలువురు చిత్రసీమ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎన్నో సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు సార్లు ఉత్త‌మ స‌హాయ న‌టిగా నేష‌న‌ల్ అవార్డు అందుకున్నారు.

సురేఖా సిక్రీ 19 ఏప్రిల్ 1945న జన్మించారు.1978 లో 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేశారు. 'తమాస్' (1988), 'మమ్మో '(1995) మరియు 'బధాయ్ హో' (2018) చిత్రాలోని నటనతో మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. 'బాలికా వధూ' సీరియల్‌తో(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు)తో బుల్లితెర‌ పై కూడా తన నటనతో అలరించారు. ఇక జోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'ఘోస్ట్ స్టోరీస్' లో సిక్రీ చివరిసారి కనిపించారు.

Advertisement

సురేఖ సిక్రీ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. 2018 లో పక్షవాతంతో.. 2020 లో బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడ్డారు.

Next Story
Share it