Thalivar 170: రజనీకాంత్‌ కొత్త సినిమా షూటింగ్‌ స్టార్ట్‌.. లుక్‌ మాములుగా లేదుగా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త సినిమా పట్టాలెక్కింది. రజనీ కొత్త మూవీకి టీ.జీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

By అంజి  Published on  4 Oct 2023 1:32 PM IST
Superstar Rajinikanth,  Thalaivar170, amitabh bachchan, fahadh faasil

Thalivar 170: రజనీకాంత్‌ కొత్త సినిమా షూటింగ్‌ స్టార్ట్‌.. లుక్‌ మాములుగా లేదుగా

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త సినిమా పట్టాలెక్కింది. రజనీ కొత్త మూవీకి టీ.జీ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందని మేకర్స్‌ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ సూపర్‌ స్టార్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. మూవీ మేకర్స్‌.. ఈ సినిమాకు సంబంధించిన రోజుకో కాస్ట్‌ను రివీల్‌ చేస్తూ, సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశారు. అమితాబ్‌, దగ్గుబాటి రానా, ఫాహద్‌ ఫాజిల్‌, మంజువారియర్‌, రితికా సింగ్‌ వంటి స్టార్‌ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరోవైపు 'జైభీమ్‌' తర్వాత జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా మెసేజ్‌ ఓరియెంటెడ్‌గా ఉండబోతున్నదట. ఈ సందేశాత్మక సినిమాకి రజనీ స్వాగ్‌ని జోడించి అంచనాలకు అందని రేంజ్‌లో సినిమా తీయబోతున్నారని టాక్‌. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Next Story