ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్

దీపావళి కానుకగా విడుదలైన 'అమరన్' సినిమాకు ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. ఆ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు.

By అంజి  Published on  3 Nov 2024 9:45 AM IST
Superstar Rajinikanth, Amaran, Sivakarthikeyan, Kollywood, Saipallivai

ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్ 

దీపావళి కానుకగా విడుదలైన 'అమరన్' సినిమాకు ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. ఆ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, నిర్మాత ఆర్ మహేంద్రన్ లను రజనీకాంత్ కలిసి సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అధికారిక X ఖాతాలో రజనీకాంత్ చిత్రం తారాగణం, సిబ్బందితో మాట్లాడారు. "రజినీకాంత్ తన స్నేహితుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ వెంచర్, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించి, శివకార్తికేయన్ నటించిన అమరన్‌ను చూశారు" అని పోస్టులో తెలిపారు. 'అమరన్' సినిమాను నిర్మించినందుకు రజనీకాంత్ ఇటీవల కమల్ హాసన్‌తో ఫోన్‌లో మాట్లాడి, అభినందించారు.

మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ 'అమరన్' అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చింది. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించారు. శివకార్తికేయన్, సాయి పల్లవిలు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రశంసలను అందుకుంటూ ఉంది.

Next Story