సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
Superstar Rajinikanth gets yet another prestigious award. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అరుదైన అవార్డు దక్కింది. రజినీకాంత్ తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు
By అంజి
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అరుదైన అవార్డు దక్కింది. రజినీకాంత్ తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను శాఖ ఆయనకు ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేసింది. చెన్నైలో ఆదాయపు పన్ను దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై.. అవార్డును అందజేశారు.
అయితే ఈ కార్యక్రమానికి పలు కారణాల వల్ల రజినీకాంత్ హాజరుకాలేదు. రజినీ స్థానంలో ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు. గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతర కృషి వల్లే ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని కోరారు. పన్నులు చెల్లించకపోతే మనం ఉనికిని కోల్పోతామని ఆమె పేర్కొన్నారు.
@LGov_Puducherry @TelanganaGuv @DrTamilisaiGuv felicitating the tax payers including @rajinikanth during the Income Tax Day celebrations at Chennai today. Chief Justice of Madras High Court, Justice Munishwar Nath Bhandari and Pr. Chief Comm of @tn_incometax is also seen pic.twitter.com/9Z4Ojhnwph
— PIB in Tamil Nadu (@pibchennai) July 24, 2022
ఇక రజినీకాంత్ 'జైలర్' అనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రారంభ దశ పనులు జరుగుతున్నాయి. జైలర్ షూటింగ్ ఆగస్ట్ 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా సూపర్‌స్టార్ నిలిచాడు.