చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. 'సూపర్‌మ్యాన్‌` సృష్టికర్త రిచర్డ్ డోనర్ ఇక‌లేరు

Superman and Goonies director dies aged 91.ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సూప‌ర్ మ్యాన్ సృష్టిక‌ర్త ఇక లేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 6:31 AM GMT
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సూపర్‌మ్యాన్‌` సృష్టికర్త రిచర్డ్ డోనర్ ఇక‌లేరు

ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సూప‌ర్ మ్యాన్ సృష్టిక‌ర్త ఇక లేరు. సూప‌ర్ మ్యాన్‌, గూనీస్ వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌ను రూపొందించిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు రిచ‌ర్డ్ డోన‌ర్ అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని వారి కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఆయ‌న మృతితో హాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది.

రిచర్డ్ డోనర్.. 1960 టీవీల్లో 'ట్విన్ లైట్ జోన్' అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. . 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన 'సూపర్ మ్యాన్' చిత్రం ఆయ‌న‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. 1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన 'గూనీస్' సినిమా కూడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. కొంత మంది పిల్లలు ఎక్కడో ఉన్న గుప్త నిధులను ఎలా కనుగొన్నారనేది ఈ స్టోరీ. హాలీవుడ్‌లో ఈ అడ్వెంచర్ డ్రామాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో 'గూనీస్' కల్డ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.

1976లో 'ఫ్రీ విల్లీ అండ్ లాస్ట్ బాయ్స్' అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన రిచర్డ్ డోనర్ కెరీర్‌లో ఎన్నోఅద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత హాలీవుడ్ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ కూడా రిచ‌ర్డ్ తెర‌కెక్కించిన గూనీస్ సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తోనే ప‌లు చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ట్లు అనేక సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు.

Next Story